రైల్వే
శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9,144 రైల్వే టెక్నీషియన్ పోస్టుల
భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆర్ఆర్బీల ద్వారా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ
ఏడాది ఏప్రిల్ 8 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తుల్లో పొరపాట్లు సవరణకు ఏప్రిల్ 9 నుంచి 18 వరకు అవకాశం కల్పించారు.
తాజా నోటిఫికేషన్ లో మొత్తం 9,144 ఉద్యోగాలు
భర్తీ చేయనున్నట్లు పేర్కొనగా అందులో… టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 1092
పోస్టులతో పాటు టెక్నీషియన్ గ్రేడ్- 3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి.
టెక్నీషియన్
గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 2024 జులై 1,నాటికి 18
నుంచి 36 ఏళ్లు లోపు ఉండాలి.
గ్రేడ్ 3 పోస్టులకు అప్లై చేసి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్లు లోపు ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది.
ఎగ్జామ్
ఫీజు రూ.500 కాగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత రూ.400 రిఫండ్ చేస్తారు.