కేంద్ర ఎన్నికల సంఘంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. శనివారం నుంచే రాజీనామా అమల్లోకి వచ్చినట్లు గెజిట్ విడుదల చేశారు.అరుణ్ గోయల్ రాజీనామాకు కారణాలు తెలియాల్సి ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘంలో సీనియర్ కమిషనర్ అనూప్‌చంద్ర పదవీ విరమణ చేశారు. తరవాత రాజీవ్ కుమార్, అరుణ్ గోయెల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనూహ్యంగా అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం, దాన్ని ఆమోదించడం జరిగిపోయింది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక్కరే మిగిలారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కరే కమిషనర్ మిగలడం చర్చకు దారితీసింది.