తిరుపతి శ్రీనివాసమంగాపురం శ్రీ
కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి.
శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు నిర్వహించారు. గరుడ పటాన్ని
అవనతం చేసి ధ్వజారోహణం రోజు ఆహ్వానించిన దేవతలను
సాగనంపారు.
శుక్రవారం
ఉదయం చక్రస్నానం ఘట్గాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంకణ బట్టార్ శ్రీ
శేషాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి
సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామికి, శ్రీ
సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం నిర్వహించిన తర్వాత చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగస్వాములయ్యే భక్తులు సమస్త
పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని అర్చక స్వాములు తెలిపారు.
కపిల తీర్థంలో..
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు నంది వాహనంపై నుంచి
అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుంచి మొదలై తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగాగా సాగింది.
భక్తులు మహావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం
అంత విశిష్టమైనదన పురాణాల ద్వారా తెలుస్తోంది.