She discovered causes of Cancer, Kamal Ranadive
మహిళా దినోత్సవ ప్రత్యేకం : కమల్ రణదివే
(1917-2001)
కమల్ రణదివే బయోమెడికల్ రిసెర్చర్. క్యాన్సర్లు,
వైరస్‌ల మధ్య సంబంధాన్ని నిరూపించే ఆమె పరిశోధన శాస్త్రప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి
గాంచింది. ఆమె అమెరికాలోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో టిష్యూ కల్చర్‌ను
అభివృద్ధి చేసే టెక్నిక్స్‌ను కనుగొంది. ఆ తర్వాత ముంబైలో ’ఎక్స్‌పెరిమెంటల్
బయోలజీ ల్యాబొరేటరీ అండ్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ’ స్థాపించడం కోసం భారతదేశానికి
తిరిగి వచ్చేసింది. ముంబైలో ఆమె ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా
వ్యవహరించింది. క్యాన్సర్‌కు జన్యువులకు ఉన్న సంబంధం గురించి, చిన్నారుల్లో
క్యాన్సర్ గురించీ కమల్ రణదివే విశేషంగా పరిశోధనలు చేసింది. ఆమె పరిశోధనల ఫలితంగా
లుకేమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ఇసోఫాగల్ క్యాన్సర్ వంటి రోగాలకు కారణాలను
గుర్తించడం సాధ్యమైంది.
కమల్ రణదివె ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో
పనిచేసింది. కమల్ తన పోస్ట్‌గ్రాడ్యుయేషన్ సైటాలజీలో చేయాలని ఆమె తండ్రి ఎంపిక
చేస్తే, ఆ చదువు పూర్తి చేయడానికి భర్త రణదివే ఎంతో సాయపడ్డాడు. తర్వాత కమల్
1949లో యూనివర్సిటీ ఆఫ్ బోంబే నుంచి పీహెచ్‌డీ పూర్తిచేసింది. డాక్టర్ ఖనోల్కర్
ప్రోత్సాహంతో అమెరికాలో ఆమెకు ఫెలోషిప్ లభించింది. బాల్టిమోర్‌లోని జాన్
హాప్కిన్స్ యూనివర్సిటీలో టిష్యూ కల్చర్ టెక్నిక్స్ మీద పోస్ట్‌డాక్టొరల్ రిసెర్చ్
ఫెలోషిప్ పొందింది.
పీహెచ్‌డీ పూర్తయాక కమల్ రణదివే మళ్ళీ
స్వదేశానికి తిరిగి వచ్చేసింది, ఐసీఆర్‌సీలో సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్‌గా చేరింది.
బొంబాయిలో ఎక్స్‌పెరిమెంటల్ బయోలజీ ల్యాబొరేటరీ అండ్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ స్థాపించింది.
1966 నుంచి 1970 వరకూ ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా
వ్యవహరించింది. తన ప్రయోగాలతో లుకేమియా, రొమ్ము క్యాన్సర్, ఇసోఫగల్ క్యాన్సర్
వంటి వ్యాధులకు కారణాలను కనుగొంది. క్యాన్సర్‌పై పరిశోధనలు చేసే భారతీయ మహిళా
శాస్త్రవేత్తలకు కమల్ రణదివే గొప్ప ప్రేరణ.