తిరుపతి
శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా
జరుగుతున్నాయి. చివరిఘట్టంలో భాగంగా శ్రీనివాసుడికి నేడు పండితులు చక్రస్నానం
క్రతువు నిర్వహించారు. శ్రీవారి అవతరణ
నక్షత్రమైన శ్రవణం నాడు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ.
బ్రహ్మోత్సవాల్లో
గురువారం రాత్రి స్వామి వారు కల్కి
అలంకారణలో అశ్వవాహనంపై విహరించారు. కలిదోషాల
నుంచి భక్తులను రక్షించేందుకు స్వామికి ఈ సేవ నిర్వహిస్తారు.
కపిల
తీర్థంలో…
తిరుపతి
శ్రీ కపిలేశ్వరస్వామి ఉద్భవించిన కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా
సాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా కపిలేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద
ఎత్తున భక్తులు తరలివచ్చారు.
బ్రహ్మోత్సవ సేవల్లో భాగంగా గురువారం రాత్రి
శ్రీ స్కోమస్కందమూర్తి, అశ్వవాహనంపై విహరించి భక్తులను ఆశీర్వదించారు. అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు.
పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం వివరిస్తోంది. స్వామి అశ్వవాహనాన్ని
అధిష్టించి కలిదోషాలకు దూరంగా ఉండాలని సూచించడంతో పాటు, నామ సంకీర్తనాదులను
ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.