New wed couple
died in road accident along with family
నంద్యాల జిల్లాలో ఈ తెల్లవారుజామున
రహదారి ప్రమాదం జరిగింది. కారు,
లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు
మరణించారు. వారిని హైదరాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు.
పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం…
ఆళ్ళగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన
ఆగి ఉన్న లారీని, వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో
ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు
పురుషులు ఉన్నారు. వారంతా సికింద్రాబాద్‌కు చెందిన వారు. తిరుపతి నుంచి వెనుకకు
తిరిగి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం
ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ కుటుంబం ఈ ప్రమాదంలో మరణించారు. రవీందర్, ఆయన
భార్య లక్ష్మి, కొడుకు బాలకిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్ సంఘటనా
స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
బాలకిరణ్, కావ్యలకు గతవారమే వివాహమైంది.
ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్ళి, మార్చి 3న షామీర్‌పేటలో రిసెప్షన్ జరిగాయి. 4వ
తేదీన కొత్తదంపతులతో సహా కుటుంబం తిరుమల దర్శనానికి వెళ్ళారు. 5న తిరిగి సికింద్రాబాద్
బయల్దేరారు. ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది.