మణిపూర్
లో రెండు తెగల మధ్య రేగిన హింస కేసును విచారిస్తున్న సీబీఐ బృందం తాజాగా న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేసింది. భద్రతా
బలగాలపై దాడితో పాటు బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్ళిన వారిపేర్లను
తాజా ఛార్జీషీటులో చేర్చారు. గౌహతిలోని కమ్రూప్ ప్రధాన న్యాయస్థానంలో ఈ
ఛార్జిషీటును దాఖలు చేశారు.
నారన్సైనాలోని
రెండో ఇండియా రిజర్వ్ బెటాలాయిన్ ఆయుధాగారంపై గత ఏడాది ఆగస్టులో ఆందోళనకారులు దాడికి పాల్పడి
300 ఆయుధాలు, 19800 రౌండ్ల మందుగుండు సామగ్రిని లూటీ చేశారు.
ఘటనపై
కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టిన సీబీఐ, ఛార్జిషీటు దాఖలు చేసింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు