నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన కీలక ఉగ్రవాది అబ్దుల్ సలీంను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)
అరెస్టు చేసింది.
జగిత్యాల ఇస్లాంపురాకు చెందిన సలీం కోసం ఎన్ఐఏ రెండేళ్ళగా
వెతుకుతోంది. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్(కడప) జిల్లా మైదుకూరులో శనివారం
రాత్రి అరెస్టు చేశారు. ఇతడి పై రూ.2
లక్షల రివార్డు ఉంది.
పీఎఫ్ఐ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉంటూ యువతను
ఆకర్షించడంలో సలీం కీలకంగా వ్యవహరించినట్లు ఎన్ఐఏ తెలిపింది. 20 రోజుల కిందట నిందితుడు మైదుకూరుకు మకాం మార్చాడు.
పీఎఫ్ఐకి
సంబంధించి నిజామాబాద్ పోలీసులు 2022 జులైలో కేసు నమోదు చేసి
దర్యాప్తు ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టులో కేసును ఎన్ఐఏ స్వీకరించి, 15 మందిని అరెస్టు చేసింది.
2047 నాటిని భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే లక్ష్యగా
పీఎఫ్ఐ ముస్లిం యువతను ఆకర్షించి, వారిని ఉగ్రవాద శిబిరాలకు శిక్షణ నిమిత్తం
పంపుతోందని ఎన్ఐఏ తెలిపింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు