Accused in RSS leader murder case arrested in South
Africa
భారతదేశం మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా
ప్రకటించిన మొహమ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దక్షిణాఫ్రికాలో
అరెస్ట్ చేసింది. నియాజీని పట్టిచ్చిన వారికి 5లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఎన్ఐఏ
గతంలో ప్రకటించింది.
మొహమ్మద్ గౌస్ నియాజీ, నిషిద్ధ సంస్థ పాపులర్
ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు. 2016లో బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ నాయకుడు రుద్రేష్ హత్య
కేసులో నిందితుడు. ఆ హత్య తర్వాత నియాజీ భారత అధికారులను తప్పించుకుపోగలిగాడు.
చాలా దేశాల్లో నివాసం ఉన్నట్లుగా చూపించి ఎక్కడికక్కడ అధికారులను బురిడీ
కొట్టించాడు.
నియాజీ కదలికలను గుజరాత్ యాంటీ టెర్రరిజం
స్క్వాడ్ ట్రాక్ చేయగలిగింది. ఆ వివరాలను ఎన్ఐఏతో పంచుకుంది. వారు దక్షిణాఫ్రికా అధికారులను
అప్రమత్తం చేసారు. అలా ఆ దేశంలో ఉన్న నియాజీని విజయవంతంగా పట్టుకోగలిగారు.
మొహమ్మద్ గౌస్ నియాజీని దక్షిణాఫ్రికాలో అరెస్ట్
చేసాక అతన్ని భారతదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ వెంటనే మొదలైపోయింది. ఇప్పుడు
నియాజీని భారత్ తీసుకొస్తున్నారు. అతన్ని ముంబైకి తీసుకొస్తారనీ, ఆర్ఎస్ఎస్
నాయకుడు రుద్రేష్ హత్యకేసులో నియాజీని అక్కడే విచారిస్తారనీ సమాచారం.