జార్ఖండ్
లో ఘోరం జరిగింది. భర్తతో కలిసి భారత పర్యటనకు వచ్చిన విదేశీ యువతి పట్ల దుండగులు
అమానుషంగా ప్రవర్తించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసులు
తెలిపిన వివరాల ప్రకారం…
దుమ్కా
జిల్లాలో భర్తతో కలిసి బైక్ పై పర్యటిస్తున్న స్పెయిన్ పౌరురాలుపై దుండగులు
అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ద్విచక్ర వాహనంపై బంగ్లాదేశ్ నుంచి దుమ్కాకు చేరుకుని
బీహార్ మీదుగా నేపాల్‌కు వెళ్లేందుకు సదరు మహిళ ప్లాన్ చేసుకున్నారు.
రాత్రి వేళ ఓ చోట డేరా వేసుకుని విశ్రాంతి తీసుకుంటుండగా,
కొందరు లైంగికదాడికి పాల్పడటంతో పాటు
గాయపరిచారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి
తీసుకున్నారు. బాధితరాలుకి దుమ్కాలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు