Indian Navy seizes 3300 KG drugs in the West Coast
భారతదేశపు పశ్చిమ తీరాన, అరేబియా సముద్రంలో భారీ
అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌ను భారత నౌకాదళం ఛేదించింది. నార్కోటిక్స్ కంట్రోల్
బ్యూరోతో జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా 3,300 కేజీల
డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో నౌక నుంచి వాటిని
సీజ్ చేసింది.
అరేబియా సముద్రంలో భారత ప్రాదేశిక సాగర జలాల్లోకి
ఒక చిన్న నౌక మంగళవారం అనుమానాస్పదంగా ప్రవేశించింది. దాన్ని గుర్తించిన అధికారులు
వెంటనే దానిని ముట్టడించారు. దాన్నుంచి 3089 కేజీల
చరస్, 158 కేజీల మెథామెఫ్తమైన్, 25 కేజీల
మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారంతా
పాకిస్తానీలు. ఆ మేరకు భారత నౌకాదళం ఒక ప్రకటన విడుదల చేసింది.
కొద్దిరోజుల క్రితం దాదాపు రూ.2,500 కోట్ల
విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో
పెద్దమొత్తంలో మెఫెడ్రిన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పుణేకు 75
కిలోమీటర్ల దూరంలోని షోలాపుర్ వద్ద కుర్‌కుంభ సమీపంలోని ఓ ఫార్మాస్యూటికల్
ప్లాంట్‌లో 700 కేజీల డ్రగ్‌ను సీజ్ చేశారు. ఇక దాదాపు అదే
సమయంలో ఢిల్లీలో 400 కేజీల డ్రగ్స్ పట్టుబడిన సంఘటన దేశ రాజధానిలో
కలకలం రేపింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు