కేంద్ర
ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ ఖాళీల
భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్
జారీ చేసింది. మొత్తం 2,
049 పోస్టులు భర్తీ
చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. https://ssc.gov.in/ లో
లాగిన్ అవ్వడం ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి
26న మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ
మార్చి 18తో ముగియనుంది. సవరణలకు మార్చి 22 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు.
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18
ఏళ్లు కాగా గరిష్ఠంగా 30 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్లు అనుసరించి కేటగిరీల వారీగా వయో
సడలింపు ఉంది. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్సర్వీస్మెన్లకు మూడేళ్లు, దివ్యాంగులకు
10 ఏళ్లు సడలింపు కల్పించారు.
జనరల్,
ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు
దరఖాస్తు
రుసుం రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు,
ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీకి వారికి మినహాయింపు ప్రకటించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
మే 6 నుంచి 8 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనుండగా, తప్పు సమాధానానికి అర
మార్కు కోత ఉంటుంది. ఉద్యోగ హోదాలను బట్టి పే స్కేలు ఉంటుంది.