ఇంగ్లాండ్‌పై జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రాంచి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. ఇంగ్లాండ్ జట్టు 192 పరుగుల లక్ష్యం విధించగా, టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి విజయం దక్కించుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 55, శుభ్‌మన్ గిల్ 52, యశస్వి జైస్వాల్ 37, ధ్రువ్ జురెల్ 39 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.
రజత్ పటీదార్, సర్ఫరాజ్ డౌకౌట్ అయ్యారు. రవీంద్ర జడేజా 4 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు షోయబ్ 3, టామ్ హార్ట్‌లీ, జోరూట్ చెరో వికెట్ పడగొట్టారు.
ఓవర్ నైట్ 40/0తో నాలుగో మ్యాచ్ మొదలైంది. భారత ఆటగాళ్లు కాసేపు బాగానే రాణించారు. యశస్వి జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. 84 పరుగులకు తొలివికెట్ కూలిపోయింది. రోహిత్ నిదానంగా ఆట మొదలు పెట్టాడు. హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే పెవిలియన్ దారిపట్టాడు. భోజన విరామ సమయానికి 118 పరుగులకు 3 వికెట్లు కోల్పోయారు. షోయబ్ బషీర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. జడేజా, సర్ఫరాజ్‌లను డకౌట్ చేశారు. 120 పరుగుల వద్ద భారత్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజ్లో ఉన్న శుభ్‌మన్ గిల్, ధ్రువ్ చాకచక్యంగా ఆడారు. ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.