ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. ఇవాళ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలంటూ రెండు రోజుల కిందటే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇవాళ తాను హాజరు కావడం లేదంటూ కేజ్రీవాల్ ఈడీ అధికారులకు సమాచారం అందించారు. కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.
ఈడీ విచారణ అంశం కోర్టులో ఉంది. మార్చి 16న విచారణకు రానుంది. అప్పటి వరకు ఆగాలని, న్యాయ వ్యవస్థను గౌరవించాలంటూ ఆప్ నేతలు చెబుతున్నారు. హాజరుకావాలంటూ పదేపదే నోటీసులు జారీ చేయడం సరికాదని వారు హితవు చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi licquor scam) సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ ఇప్పటికే విచారించింది.సీబీఐ అధికారులు 2023 ఏప్రిల్ 9న 8 గంటల పాటు విచారించారు. విదేశాలకు నగదు తరలింపు వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేసింది. పలుమార్లు సమన్లు జారీ చేశారు. మద్యం కేసులోనే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను జైల్లో పెట్టారు.