గుజరాత్
పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, సుదర్శన్ సేతును ప్రారంభించిన అనంతరం ద్వారక
ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నీట
మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించారు. ఆక్సిజన్ మాస్కు
పెట్టుకుని సముద్ర జలాల్లోకి దిగారు. ఈ విషయాన్ని మోదీ ట్వీట్ చేయడంతో పాటు స్కూబా
డైవింగ్ చేసిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
శ్రీ
మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా ద్వారకలో నివసించడంతో పాలించాడని పురాణాల
ద్వారా తెలుస్తోంది. శ్రీ కృష్ణ పరమాత్మ తన అవతార సమాప్తి తర్వాత ద్వారక, సముద్రంలో
మునిగిపోయిందని హిందువులు విశ్వసిస్తారు. ఆరేబియా సముద్రం అడుగుభాగంలో ఇప్పటికీ
నాటి ద్వారక నగర అవశేషాలు ఉన్నాయి.
నేటి
ఉదయం దేవభూమి ద్వారకలో పర్యటించిన ప్రధాని మోదీ, ఆరేబియా సముద్ర జలాల్లో స్కూబా
డైవింగ్ చేసి నీట మునిగిన ద్వారకను
దర్శించారు.
నీట
మునిగిన ద్వారనలో ప్రార్థనం చేయడాన్ని దివ్యమైన అనుభూతిగా పేర్కొన్న మోదీ, శ్రీకృష్ణుడు
ప్రజలందరినీ ఆశీర్వదించాలని ఎక్స్ వేదికగా కోరారు. పురాతన ద్వారక అవశేషాలను
చూడటంతో తన దశాబ్దాల కల నెరవేరిందన్న మోదీ, నెమలిఈకలను ద్వారకాధీశుడి ముందు ఉంచి
నమస్కరించానన్నారు.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం