రాంచీ
వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్
ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 307 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు 46
పరుగుల ఆధిక్యం లభించింది.
నేడు, మూడో రోజు ఆటలో భాగంగా 219/7 వద్ద ఆటను
ప్రారంభించిన భారత్, స్కోర్ బోర్డుకు 88 పరుగులు జోడించి ఆలౌటైంది.
భారత్
ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురైల్(90), యశస్వీ జైస్వాల్(73), గిల్ (38), కుల్దీప్(28)
పరుగులు చేశారు. ధ్రువ్ జురైల్ 149 బంతులు ఎదుర్కొని 90 పరుగులు చేశాడు. నాలుగు సిక్సులు, ఆరు ఫోర్లు బాదాడు. కెరీర్ లో
తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
మూడో
రోజు ఆటలో కుల్దీప్ యాదవ్(28) ను జేమ్స్ అండర్సన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో 89
ఓవర్లకు భారత్ 8 వికెట్లు నష్టపోయి 253 పరుగులు చేసింది. కుల్దీప్ ఔట్ కావడంతో
క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్, 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. బషీర్ బౌలింగ్ లో
పెవిలియన్ చేరారు. 303 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ నష్టపోయిన భారత్, 307 పరుగులు వద్ద ధ్రువ్ ఔట్ కావడంతో పదో వికెట్
నష్టపోయింది.
ఇంగ్లండ్
బౌలర్లలో బషీర్ ఐదు వికెట్లు తీయగా, హార్ట్ లీ మూడు, అండర్సన్ రెండు వికెట్ల్
తీశారు.
సెకండ్
ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 5 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయింది. అశ్విన్
బౌలింగ్ లో 19 పరుగుల వద్ద బెన్ డకెట్,
ఓలీ పోప్ వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది.
9 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 38 పరుగులు చేసింది.