రాంచీ
వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.
ఇంగ్లండ్ తొలి ఇనింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిసే
సమయానికి భారత్ ఏడు వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన
తొలి ఇన్నింగ్స్ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్కు మరో 134 పరుగులు అవసరం.
తొలి
రోజు ఆటలో ఇంగ్లండ్ ఏడు వికెట్లు నష్టపోయి 302 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో
51 పరుగులకు మిగతా మూడు వికెట్లు కోల్పోయి పెవిలియన్ చేరింది. తొలి ఇన్నింగ్స్
ఆరంభించిన భారత్కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. జట్టు స్కోరు నాలుగు వద్ద
ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ(2) పెవిలియన్
చేరాడు. జేమ్స్ అండర్సన్ వేసిన 2.4 బంతిని
బెన్ ఫోక్స్ కు క్యాచ్ గా అందించి వెనుదిరగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్(38),
షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 86 పరుగులు వద్ద భారత్ రెండో వికెట్ నష్టపోయింది.
రజత్ పటీదార్(17), రవీంద్ర జడేజాను కూడా బషీర్ ఔట్ చేయడంతో భారత్ కష్టాలు
మొదలయ్యాయి. సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1) వికెట్లను టామ్ హార్ట్ లే తన ఖాతాలో వేసుకున్నాడు.
రెండో రోజు ఆట ముగిసే
సమయానికి ధ్రువ్ జురైల్(30), కుల్దీప్ యాదవ్(17) క్రీజులో ఉన్నారు. భారత లైనప్ లో
ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ( 73) మాత్రమే
రాణించాడు. మినహా ఎవరూ అర్థశతకం కొట్టలేకపోయారు.
ఇంగ్లండ్
బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు తీయగా, టామ్ హార్ట్ లే రెండు, జేమ్స్
అండర్సన్ ఒక వికెట్ తీశారు.