మెగా
డీఎస్సీ ప్రకటించాలంటూ ఏపీ కాంగ్రెస్ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్ ’కార్యక్రమం
సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ
నేతలు, కార్యకర్తలతో కలిసి వెలగపూడిలోని సచివాలయానికి పీసీసీ చీఫ్ షర్మిల
వెళ్ళేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
కొండవీటి
ఎత్తిపోతల పథకం వద్ద షర్మిల కారును అడ్డుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి
తీసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల, కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాదనకు దిగారు. తమపై
దౌర్జన్యం సరికాదంటూ నినాదాలు చేశారు.
పోలీసు
వాహనంలో ఎక్కిస్తున్న సమయంలో షర్మిల జారి పడ్డారు. అయినప్పటికీ ఆమెను అదే వాహనంలో
తరలించారు.
మెగా
డీఎస్సీ కి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘చలో సెక్రటేరియట్’ కు పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్
నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాత్రి నుంచి ఆంధ్రరత్న భవన్ లోనే షర్మిల
ఉన్నారు. ఆమె బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలోకి
వెళ్ళేందుకు ప్రయత్నించిన గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్ వలీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
పోలీసుల
వైఖరిని వ్యతిరేకిస్తూ షర్మిలతో పాటు పలువురు నేతలు పార్టీ కార్యాలయంలో బైఠాయించి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
వైసీపీ నియంత పాలనలో మెగా
డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని విమర్శించారు. 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని,
కేవలం ఆరు వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని షర్మిల ప్రశ్నించారు.