Sonia Gandhi unanimously elected to Rajya Sabha
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ
రాజ్యసభకు రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 77 ఏళ్ళ సోనియాగాంధీ లోక్‌సభ
సభ్యత్వం పూర్తికావచ్చింది. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయదలచుకోలేదు.
సోనియాగాంధీ రాజస్థాన్‌లోని జైపూర్‌నుంచి
రాజ్యసభకు తన నామినేషన్ దాఖలు చేసారు. ఆ సీటు ఇప్పటివరకూ మాజీ ప్రధానమంత్రి
మన్మోహన్ సింగ్‌ది.
సోనియా 2006 నుంచీ లోక్‌సభకు ఉత్తరప్రదేశ్‌లోని
రాయబరేలీ నుంచి ప్రతినిధిగా ఉన్నారు. 2019లో పార్టీ అత్యంత అవసాన దశలో ఉన్నప్పుడు
సైతం, రాహుల్ గాంధీ అమేఠీలో బీజేపీ అభ్యర్ధి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయినప్పుడు
కూడా, సోనియాగాంధీ రాయబరేలీ నుంచి గెలిచారు.
సోనియా లోక్‌సభ నుంచి రాజ్యసభకు మారడాన్ని ఒక తరం
మార్పుగా కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తే, ప్రత్యర్ధి పార్టీ బీజేపీ మాత్రం రాబోయే లోక్‌సభ
ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని సోనియా ముందుగానే ఒప్పుకున్నారని వ్యాఖ్యానించింది.
‘‘అమేఠీలో కాంగ్రెస్ దారుణ ఓటమి తర్వాత, ఇక
రాయబరేలీ వంతు. రాజ్యసభకు వెళ్ళాలన్న సోనియాగాంధీ నిర్ణయం, రాబోయే పరాజయాన్ని
ఒప్పుకున్నట్లే. గాంధీ కుటుంబం సభ్యులు ఇన్నాళ్ళూ తమ కంచుకోటలుగా చెప్పుకున్న
నియోజకవర్గాలను ఇప్పుడు వదిలేసుకున్నారు. కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ 11 సీట్లు
ఇస్తామంది. కానీ ఆ పార్టీ ఒక్కస్థానంలోనైనా గెలవలేదు’’ అని బీజేపీ నేత అమిత్
మాలవీయ ట్వీట్ చేసారు.