రాజ్కోట్
వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ పై భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్
నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్ ఘోరంగా విఫలమైంది.
నాలుగో రోజు ఆటలో 39.4 ఓవర్లకు 122 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు పెవిలియన్
చేరింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి
రాంచీ వేదికగా జరగనుంది.
తొలి
ఇన్నింగ్స్ లో భారత్ 445 పరుగులు చేయగా ఇంగ్లండ్ 319 రన్స్ కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్
ను భారత్, 430 /4 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది.
భారత్
నిర్దేశించిన 557 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్
పేలవంగా సాగింది. భారత బౌలర్ల దెబ్బకు పెవిలియన్ కు క్యూ కట్టారు. మార్క్ వుడ్(33) మాత్రమే ఫర్వాలేదు అనిపించాడు.
బెన్
డకెట్ రనౌట్ తో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ పతనం ప్రారంభమైంది. 6. 1 బంతికి
డకెట్ ఔట్ కావడంతో 15 పరుగుల వద్ద
ఇంగ్లండ్ తొలి వికెట్ నష్టపోయింది. బుమ్రా
బౌలింగ్ లో జాక్ క్రాలే (11)ఎల్బీ కావడంతో భారత్ కు రెండో వికెట్ దక్కింది. 20
పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్
నష్టపోయింది. ఓలీ పోప్(3) జడేజా బౌలింగ్ లో రోహిత్ క్యాచ్ గా దొరికిపోయాడు. దీంతో
పది ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది.
ఆ తర్వాత 28 పరుగుల వద్ద జడేజా బౌలింగ్ లోనే
జానీ బెయిర్ స్టో కూడా వెను దిరగడంతో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దిగజారింది. జడేజా
బౌలింగ్ లో జో రూట్ (7), ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వత వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్
బెన్ స్టోక్స్(15) కూడా ఆరో వికెట్ గా
నిష్క్రమించాడు. కుల్దీప్ బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు.
బెన్ ఫోక్స్(16), టామ్ హార్ట్ లీ(16)
వెనుదిరగడంతో భారత్ భారీ విజయం సాధించింది.
రవీంద్ర
జడేజా 5 వికెట్లు తీయగా, కుల్ దీప్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీశారు.