క్రీడా చరిత్రలో ఆసియా టీమ్ ఛాంపియన్స్ బ్యాడ్మింటన్‌లో మొదటిసారిగా మహిళా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో టీమ్‌ఇండియా మహిళా జట్టు జపాన్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది. మొదట జపాన్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించినా, చివరకు భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. స్టార్ షట్లర్ పీవీ సింధు 13-21, 20-22, 22-20 తేడాతో విజయం సాధించింది.రెండో మ్యాచ్‌లో త్రిషా, గాయత్రీ గోపిచంద్ రాణించారు. నమీ మత్సుయమ, చిహారు షిదపై 21- 17, 16- 21 22- 20 తేడాతో గెలిచారు. మూడో మ్యాచ్‌లో నొజోమి ఒకుహర అష్మితాపై 21- 17, 21- 14 తేడాతో గెలిచింది. జపాన్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
నాలుగు, ఐదు రౌండ్లలో టీమ్ ఇండియా జట్టులో అశ్విని పొన్నప్పతో కలసి పీవీ సింధు వరల్డ్ నెంబర్ 11 స్థానంలోని జోడి మియుర, అయకో సుకురమోటోతో తలపడ్డారు. వారిపై 21- 14, 21- 11తో విజయం సాధించారు. చివరి రౌండ్లో భారత షట్లర్ అనమోల్ 52 నిమిషాల్లో పోరాటం ముగించి 29వ ర్యాంకర్ నత్సుకి నిదైరాపై గెలిచింది. దీంతో భారత్ టీం ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో మొదటి సారి ఫైనల్స్‌కు చేరుకుంది.