ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్
లో భారతీయ యువతి ప్రమాదవశాత్తు చనిపోయింది. వరదలో చిక్కుకున్న కారులో 28 ఏళ్ల యువతి మృతదేహాన్ని గుర్తించారు.
మౌంట్ ఇసా పోలీసులు ఈ మేరకు ప్రకటన విడుద చేశారు. మృతురాలికి సంబంధించిన వివరాలు
మాత్రం వెల్లడించలేదు. ఘటనపై దర్యాప్తు జరుగుతుందన్నారు.
మాల్బన్
నదిపై ఉన్న క్లాన్కర్రీ డౌచెస్ రోడ్డుపై వరదనీటిలోనే కారు నడిపేందుకు ప్రయత్నించడంతో
ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నీరు అడుగులోతు మేరే
ఉన్నప్పటికీ ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో
కార కోట్టుకుపోయి ఉండవచ్చు అని భావిస్తున్నారు.
యువతి తమ ఉద్యోగేనని ఫాస్ఫేట్
మైనింగ్లోని ఓ సంస్థ పేర్కొంది. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలియజేసింది.
ఘటనపై
స్పందించిన కాన్బెరాలోని భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది. మృతురాలి
కుటుంబానికి ఏ సాయం చేసేందుకైనా సిద్ధమని వెల్లడించింది.
ఇటీవల క్వీన్స్లాండ్ ను కిర్రీలీ
సైక్లోన్ అతలాకుతలం చేసింది. చాలా రోజుల పాటు వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో
నీరు నిలిచింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు