దిల్లీలో ఘోరం జరిగింది. ఓ పెయింట్
పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో 11 మంది చనిపోయారు. ఈ ఘటన ఆలిపూర్ లోని దయాల్ పూర్
మార్కెట్ ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఓ దగ్గర అంటుకున్న మంటలు
కాసేపట్లోనే ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించడంతో 11 మంది కార్మికులు సజీవ
దహనమయ్యారు. ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ సహా
మరో నలుగురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి
చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, 22 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేశారు. గురువారం
రాత్రే ఏడు మృతదేహాలను గుర్తించగా, నేటి ఉదయం మరో నాలుగు శవాలను గుర్తించారు.
మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలు ఎవరివో గుర్తించడం కష్టంగా మారింది.
ప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో భారీ పేలుడు
జరిగినట్లు శబ్ధం వినపడిందని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరిలో నిల్వ చేసిన రసాయనాల
వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కేసు నమోదు చేసి ప్రమాద కారణాలపై విచారణ
చేపట్టారు. సంఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు