Car hits West Bengal Governor’s convoy
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ కాన్వాయ్కి
ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఇందేర్పురి ప్రాంతంలో మంగళవారం నాడు ఒక ప్రైవేటు కారు ఏకంగా గవర్నర్ కాన్వాయ్‌లోకి చొచ్చుకొచ్చేసింది. కాన్వాయ్‌లోని
ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు.
కాన్వాయ్‌ని ఢీకొట్టిన వాహనాన్ని అధికారులు గుర్తించారు.
ఆ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
అయితే ఈ ఘటన విద్రోహచర్య అయి ఉండవచ్చునని రాజ్‌భవన్
వర్గాలు భావిస్తున్నాయి. గవర్నర్‌ను పటిష్ట భద్రతా వలయంలోకి తరలించారని పోలీసులు
వివరించారు.
గవర్నర్ ఆనందబోస్ పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ
ప్రాంతాన్ని సందర్శించిన మర్నాడే ఈ సంఘటన జరగడం గమనార్హం. అక్కడ ఆయన ఆందోళన
చేస్తున్న మహిళలతో మాట్లాడారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత సాజహాన్ షేక్, అతని
అనుచరులు గత కొద్దిరోజులుగా తమను తీవ్రంగా వేధిస్తున్నారంటూ కొందరు మహిళలు సందేశ్‌ఖాలీలో
ఆందోళన చేస్తున్నారు.
సందేశ్‌ఖాలీ ప్రాంతాన్ని
సందర్శించిన తరువాత, గవర్నర్ ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఈ ప్రమాదం జరిగింది. దీన్నిబట్టి
అక్కడ ప్రజలను తృణమూల్ నాయకులు ఎంతలా వేధిస్తున్నారో, పీడిస్తున్నారో అర్ధం
చేసుకోవచ్చు. ఒక పెద్ద రాష్ట్ర గవర్నర్‌కే భద్రత సరిగ్గా లేకపోతే ఎలా అని ప్రజలు
భయభ్రాంతులయ్యారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు