ఇద్దరు తీవ్రవాదారులపై జమ్ము-కశ్మీర్ పోలీసులు ఛార్జిషీటు
వేశారు. పాకిస్తాన్ లో తీవ్రవాద శిక్షణ పొందిన
ఇద్దరు వ్యక్తులు 13 ఏళ్ళ కిందట నేపాల్
గుండా భారత్ లో ప్రవేశించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేసు నమోదైంది.
కిష్టావార్ కు చెందిన అబ్దుల్ వారిస్, దోడాకు చెందిన మస్రత్ హుస్సేన్, లపై ఛార్జిషేట్ వేసి
ఎన్ఐఏ కోర్టుకు అందజేశారు.
చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందున పలు సెక్షన్ల కింద
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు న్యాయస్థానానికి
తెలిపారు.
నిందితులపై 2010, అక్టోబర్ 25న బానుఫోర్టు
పో లీసు స్టేసన్ లో కేసు నమోదైంది.
అనంతరం జమ్ము-కశ్మీర్ రైల్వే స్టేషన్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన
సమయంలో వారి నుంచి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు
చెందిన సాహిత్యం, ఇతర డాక్యుమెంట్లు, రూ.
50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు విచారణ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు.
ఫూంచ్ వద్ద ఎల్వోసీని దాటి పాకిస్తాన్ కు వెళ్లి తీవ్రవాద సంస్థల్లో శిక్షణ తీసుకున్నట్లు
తెలిపారు. ఆయుధాల వాడకం, పేలుళ్ళకు సంబంధించి తర్ఫీదు పొందినట్లు పోలీసులు ఎదుటు
ఒప్పుకున్నారు. నిషేధిత లష్కరే ఈ తయిబాలో చేరేలా
యువతను ప్రొత్సహించడమే లక్ష్యంగా పనిచేసినట్లు తెలిపారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు