చెన్నై మాజీ మేయర్ సదాయి దురైస్వామి
కుమారుడు, ఫిల్మ్ డైరెక్టర్ వెట్రి దురైస్వామి మృతదేహం
దొరికింది. సట్లజ్ నదిలో ఆయన శవాన్ని గజ ఈతగాళ్ళు గుర్తించి బయటకు
తీసుకొచ్చారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్
జిల్లాలో వెట్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఫిబ్రవరి 4న అతడు
ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది.
కారులో ప్రయాణిస్తున్న గోపినాథ్ అనే
వ్యక్తి ప్రాణాలతో బయటపడగా, డ్రైవర్ మరణించాడు. 9 రోజుల గాలింపు తర్వాత వెట్రీ
మృతదేహాన్ని గజ ఈతగాళ్ళ బృందం కనిపెట్టింది.
తన కుమారుడు వెట్రీ జాడ కనిపెట్టిన
వారి కోసం సదాయి దొరైస్వామి భారీ రివార్డు కూడా ప్రకటించారు. వెట్రి ఆనవాళ్లను
గుర్తించినవాళ్లకు కోటి రూపాయలు అందజేస్తానని ప్రకటించి స్థానికులను కూడా సాయం
అడిగారు.
మహిన్ నాగ్ అసోసియేషన్‌కు చెందిన గజ ఈతగాళ్ల బృందం
వెట్రి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.
మృతదేహాన్నిపోస్టుమార్గం కోసం షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి
తీసుకెళ్ళారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు