ఓ యువకుడి దారుణహత్య తెలంగాణలోని వేములవాడలో కలకలం రేపింది. స్నేహితుడే నమ్మించి తీసుకెళ్లి, తరవాత గొంతుకోసం హత్య చేశాడని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వేములవాడ ఓల్డ్అర్బన్ కాలనీకి చెందిన కె.శ్రీధర్, అదేకాలనీలోని బాబు ఇద్దరూ స్నేహితులు. మూడేళ్ల కిందట వీరి మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో శ్రీధర్, బాబు బైక్‌కు నిప్పుపెట్టాడు. అది మనసులో పెట్టుకున్న బాబు, ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించాడు. శ్రీధర్‌తో స్నేహం నటించాడు.
ఆదివారం శ్రీధర్‌ను పార్టీకి పిలిచిన బాబు, బైపాస్ రోడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరూ బాగా మద్యం సేవించారు. అర్థరాత్రి తరవాత బాబు, శ్రీధర్ గొంతుకోసి (crime news) చంపాడు. సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. బాబు భార్య భాగ్యరేఖ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీధర్‌ను హత మార్చేందుకే బాబు స్నేహంగా ఉంటున్నట్లు నటించాడని పోలీసులు తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు