ఉత్తరాఖండ్
లోని హల్ద్వానీ హింస ఘటనలో పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ అక్కడ ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మళ్ళీ
అల్లర్లు చెలరేగే అవకాశముండటంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. హింసకు
కారణమైన అల్లరిమూకలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, ఘటనకు సంబంధించి ఇప్పటికే
మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, ఎలాంటి అనుమతులు
లేకుండా చేసిన కట్టడాలను కూలగొట్టాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో
ఫిబ్రవరి 8న కోర్టు ఉత్తర్వులు అమలు
చేసేందుకు వెళ్ళిన పోలీసు, మున్సిపల్
అధికారులపై కొందరు విచాక్షణా రహితంగా దాడి చేశారు. రాళ్ళు విసిరారు. పోలీసులను వెంటాడి
పోలీసు స్టేషన్ కు నిప్పు పెట్టారు. సెక్యూరిటీ వాహనాలకు నిప్పు పెట్టి ప్రభుత్వ
ఆస్తులు ధ్వంసం చేశారు.
ఆందోళన కారుల దాడులతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు
జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతానికి
పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, మళ్ళీ అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు అక్కడ
పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని 5 సూపర్
జోన్స్ గా విభజించి ఏడుగురు ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు.
హింసకు
పాల్పడిన 5 గురిని అరెస్టు చేసిన పోలీసులు, అల్లర్లతో సంబంధమున్న 19 మందిపై
ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు 5 వేల మంది ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్నట్లు
పోలీసులు చెబుతున్నారు.
హల్ద్వానీలో
సాధారణ పరిపరిస్థితులు నెలకొన్నాయని, బంభూల్పూరలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని
అడిషినల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(శాంతిభద్రతలు) అన్షుమాన్ తెలిపారు. నిందితులను
అరెస్టు చేసేందుకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు