జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో
ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్,
బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ ప్రతీ ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
ప్రవేశ
పరీక్ష సందర్భంగా విద్యార్థులపై భారం తగ్గించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్, సిలబస్
లో మార్పులు చేసింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్
సిలబస్ ను తగ్గించారు. బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్ కొంచెం తక్కువగా
తగ్గించారు.
నీట్ (యూజీ)-2024
పరీక్ష రిజిస్ట్రేషన్ కు మార్చి 9వ తేదీతో గడువు ముగియనుంది. దరఖాస్తుదారులు క్రెడిట్
కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును మార్చి 9వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు
చెల్లించే అవకాశం కల్పించారు.
తెలుగు, హీందీ, ఇంగ్లీషు సహా 13 భాషల్లో మే 5న ఈ
పరీక్ష నిర్వహించనున్నారు.
జనరల్ కేటగిరీ,
ఎన్నారై అభ్యర్థులు పీజు కింద రూ.1,700 చెల్లించాల్సి ఉండగా,
జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్సీల్ కేటగిరీ విద్యార్థులు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్
అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి.
ఈ ఏడాది నీట్ పరీక్ష మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం
5.20 గంటల వరకు
జరగనుంది. జూన్ 14న ఫలితాలు
వెల్లడించనున్నారు.