AP CID files chargesheet in IRR case, NCBN is Accused 1
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ దాఖలు
చేసింది. ఆ కేసులో మొదటి నిందితుడుగా (ఎ1) చంద్రబాబు నాయుడిని, రెండో నిందితుడుగా
(ఎ2) మాజీ మంత్రి పొంగూరి నారాయణను, 14వ నిందితుడిగా నారా లోకేష్‌ను చేర్చింది.
లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా అమరావతి ఇన్నర్
రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్‌ను మార్చిన కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ
కేసులో ఈ గురువారం నాడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
లింగమనేని రమేష్‌కు లబ్ధి కలిగించేలా క్విడ్ ప్రో కో కుంభకోణానికి పాల్పడినట్లు
సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ
మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, లింగమనేని రమేష్ తదితరులను నిందితులుగా
పేర్కొంది. వారిపై భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు
చేసినట్లు సీఐడీ వెల్లడించింది.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చైర్మన్‌గా
చంద్రబాబు నాయుడు, వైస్ ఛైర్మన్‌గా మాజీ మంత్రి నారాయణ అవినీతికి పాల్పడ్డారని
సీఐడీ ఆరోపణ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట కోట్ల రూపాయల విలువైన భూములను
దోచుకున్నారనీ ఆరోపిస్తూ ఏపీ సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. లింగమనేని రమేష్
భూముల మార్కెట్ విలువను రూ.177.5 కోట్ల నుంచి రూ.877.5 కోట్లకు… రాజధాని
నిర్మాణం తర్వాత అవే భూముల విలువను రూ.2130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను
ఖరారు చేసారని సీఐడీ ఆరోపించింది.