UCC Bill: Registration of live-in relationships mandatory
ఉత్తరాఖండ్ శాసనసభలో ఇవాళ ఉమ్మడి పౌరస్మృతి
బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో వివాహాలు,
విడాకులు, వారసత్వ, సహజీవనం తదితర అంశాలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలున్నాయి.
వాటిలో చేసిన ప్రతిపాదనల్లో ఒకటి… సహజీవనం చేసే జంటలు తమ బంధాన్ని తప్పనిసరిగా రిజిస్టర్
చేసుకోవాలి.
యూసీసీ బిల్లు చట్టరూపం దాలిస్తే, సహజీవనానికి
చట్టబద్ధత కల్పించడం తప్పనిసరి అవుతుంది. సహజీవనం చేసే జంట, ఆ బంధంలోకి
ప్రవేశించిన నాటి నుంచీ నెలరోజుల లోపు తమ బంధాన్ని రిజిస్టర్ చేసుకోవాలి.
అంతేకాదు, వయోజనులైన యువతీయువకులు సహజీవనం చేయడానికి తమ తల్లిదండ్రుల అనుమతి
తప్పనిసరిగా తీసుకోవాలి.
యూసీసీ బిల్లు బాల్యవివాహాలపై పూర్తిగా నిషేధం
విధించింది. ఏ మతానికి చెందిన వారికైనా విడాకులకు ఒకే విధానం ప్రకటించింది. ఏ
మతానికి చెందిన మహిళకైనా తమ పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. ఏ మతానికి
చెందిన వారైనా కనీస వివాహ వయస్సు యువతులకు 18ఏళ్ళు, యువకులకు 21ఏళ్ళుగా ఉంటుంది.
వివాహాన్ని రిజిస్టర్ చేయించడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ జరగని పెళ్ళిళ్ళు చెల్లవు.
పెళ్ళయిన ఒక యేడాది లోపు విడాకుల పిటిషన్లను అంగీకరించరు.
వ్యక్తులు తమ వివాహాన్ని తమ మత సంప్రదాయాలకు అనుగుణంగా చేసుకోవచ్చు.
సప్తపది, ఆశీర్వాద్, నిక్కా, హోలీ యూనియన్, ఆనంద్ కరాజ్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్
ప్రకారం చేసుకునే పెళ్ళి, లేదా ఆర్య మ్యారేజ్ వ్యాలిడేషన్ యాక్ట్… ఏ
పద్ధతిలోనైనా పెళ్ళి చేసుకోవచ్చు, కానీ దాన్ని ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా రిజిస్టర్
చేసుకోవాలి.
అయితే, షెడ్యూల్డు తెగలకు
చెందిన వారు, రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలున్నవారికి యూసీసీ బిల్లు నిబంధనల నుంచి
మినహాయింపు ఉంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు