విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ టీమ్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. 292 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా జట్టులో బుమ్రా 3, అశ్విన్ 3 వికెట్లు తీశారు.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై నెగ్గింది. ఇంగ్లాండ్ ఆటగాడు హార్ట్‌లీని బుమ్రా 69.2వ ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇంగ్లాండ్ జట్టు 292 పరుగులకే ఆలౌటైంది. ఐదు టెస్టు మ్యాచుల్లో ఇప్పటి వరకు భారత్ ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి గెలిచి సమంగా ఉన్నాయి.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పేసర్ ముకేశ్ కుమార్, షోయబ్ బషీర్‌ను డకౌట్ చేశాడు. భారీ స్కోరు లక్ష్య సాధనలో ఆట ప్రారంభంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ జాక్ క్రాలే హాఫ్ సెంచరీ చేశారు. 27 ఓవర్లకు 126 పరుగులు చేసి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయింది.36 ఓవర్లకు 167, 43 ఓవర్లకు 197 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. 58 ఓవర్లకు 271 పరుగుల స్కోరు చేసి 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, ఆ తరవాత మరో రెండు వికెట్లు కోల్పోయింది. 69.2 ఓవర్లకు 292 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌటైంది.