ఉత్తరప్రదేశ్
తీవ్రవాద నిరోదక సంస్థ, మాస్కోలోని భారత
రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తోన్న దౌత్యశాఖ ఉద్యోగిని అరెస్టు చేసింది.
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకు సమాచారం అందజేస్తున్నాడనే ఆరోపణలపై అతడిని
ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
భారత
విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోన్న సతేందర్ ద్ర
సివాల్, పాకిస్తాన్కు సమాచారం చెరవేస్తున్నారని తీవ్రవాద నిరోధక సంస్థ విచారణలో
తేలింది.
భారత
దౌత్యాధికారులకు ఆర్థిక ప్రయోజనాలు ఆశ చూపి వారి నుంచి దేశానికి సంబంధించిన రహస్య
సమాచారాన్ని అందుకుంటుందని ఏటీఎస్ కు సమాచారం అందింది. భారత ఆర్మీకి సంబంధించిన
సున్నిత సమాచారాన్ని కూడా అక్రమమార్గాల్లో రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. దేశ
అంతర్గత రక్షణకు ప్రమాదం వాటిల్లే చర్యలకు పాల్పడుతోంది.
హాపూర్ పరిధిలోని షమహిద్దీయిన్పూర్ గ్రామానికి చెందిన సతేందర్ సివాల్ , గూఢచర్య కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు విచారణలో తేలింది. దౌత్యశాఖ
ఉద్యోగిగా తన హోదాను ఉపయోగించి, విదేశీ
వ్యవహారాలు, రక్షణ శాఖ, భారత ఆర్మీకి చెందిన వ్యూహాత్మక కార్యకలాపాల సమాచారాన్ని
ఐఎస్ఐకు చేరవేశాడు. అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి భారీగా డబ్బు
అందుకున్నాడని అభియోగం నమోదైంది.
విశ్వసనీయ
వర్గాల నుంచి అందిన సమాచారం, అలాగే నిఘా వర్గాల విచారణ తర్వాతే సత్యేంద్ర సివాల్ ను
అదుపులోకి తీసుకున్న తీవ్రవాద నిరోధక బృందం, అతడిని విచారణ కోసం మీరూట్ కు
తరలించింది. విచారణలో సరైన సమాధానాలు చెప్పని సత్యేంద్ర, గూఢచర్యానికి
పాల్పడినట్లు అంగీకరించాడు.
2021
నుంచి మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో సతేందర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.