కొన్ని వినడానికి విచిత్రంగా ఉన్నా…నమ్మాల్సిందే. ఇటీవల కరెంట్ షాక్తో ఓ వ్యక్తి కాలిపోయి చనిపోయాడు.బంధువులు శవాన్ని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం వెళ్లారు. అందరూ శోకసముద్రంలో ఉండగా, చనిపోయాడని అనుకుంటోన్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అంతే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన రంగంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే…
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో చనిపోయిన వ్యక్తి ఫోన్ చేశాడు.దీనికి ముందు…పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ శవాన్ని (crime news) సమీప రైతులు గుర్తించారు. చెప్పులు చూసి పూసయ్యగా భావించారు. వారి బంధువులకు సమాచారం అందించారు. వారు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోస్టుమార్టం జరుగుతుండగానే పూసయ్య నుంచి బంధువులకు ఫోన్ వచ్చింది. కాసేపు బంధువులు అయోమయంలో పడ్డారు. గాయపడిన పూసయ్యను చూసి అందరూ ప్రశ్నించారు. తాను పొలం వెళ్లిన సమయంలో ముగ్గురు దుండగులు ఓ వ్యక్తిని చంపి (crime report) పెట్రోల్ పోసి నిప్పంటించారని, తాను చూడటంతో తనపై దాడి చేశారని చెప్పాడు. తాను స్పృహతప్పి పడిపోవడంతో ఆటోలో వేసుకుని వెళ్లి రోడ్డు పక్కన పడేశారని వివరించారు.
ఆ మార్గంలో వెళుతున్న వారు గుర్తించి తనను ఆసుపత్రిలో చేర్పించారని పూసయ్య చెప్పాడు. దీంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ దుండగులు కాల్చి వేసింది ఎవరిని అనేదానిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు