రష్యాలో బుధవారంనాడు ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యా సైనిక విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ సరిహద్దులో విమానం కూలిపోయిన దుర్ఘటనలో 74 మంది ప్రాణాలు (russian plane crash) కోల్పోయారు. వీరిలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు ఉన్నారని తెలుస్తోంది. యుద్ద ఖైదీలతోపాటు, ఆరుగురు విమాన సిబ్బంది, ముగ్గురు రక్షణ సిబ్బంది ఉన్నారు. ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గోరాడ్ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
విమాన ప్రమాద కారణాలను గుర్తించేందుకు రష్యా ప్రత్యేక మిలటరీ కమిషన్ ఘటనా ప్రాంతానికి వెళ్లింది. విమానం అదుపు తప్పి వేగంగా కిందకు పడిపోవడాన్ని కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. యుద్ధ ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ సైనికులను తరలిస్తున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
విమానాన్ని ఉక్రెయిన్ బలగాలు కూల్చేశాయని స్థానిక మీడియా ప్రకటించింది. ఆ విమానంలో యుద్ద ఖైదీలు లేరని రష్యా ఆయుధాలు తరలిస్తోందని ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేశారు. యుద్ధఖైదీల భద్రత రష్యాదేనని ఉక్రెయిన్ హెచ్చరించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు