నికరాగ్వాలో గౌటిమాలా కోర్టు తీర్పు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2008లో 15 మంది నికరాగ్వా పౌరులు, మరో డచ్ పౌరుడిని ఊచకోత కోసి చంపిన కేసులో గౌటిమాలా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. డ్రగ్స్ స్మగ్లర్ రిగోబెర్టో డానులోకు 16 మంది ఊచకోత కేసులో (massacre of 16 people) 808 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ గౌటిమాలా కోర్టు వెలువరించిన తీర్పు న్యాయచరిత్రలో అరుదైనది. 2016లో మరో డ్రగ్స్ డాన్ మార్విన్ మోంటియల్ మారిన్‌కు కూడా ఇలాంటి శిక్షే విధించారు.
ఒక్కో హత్యకు 50 సంవత్సరాల చొప్పున, 16 మందిని హత్య చేసిన కేసులో డానులోకు ఈ శిక్ష ఖరారు చేసినట్లు న్యాయమూర్తి వెల్లడించారు. సహజంగా ఖైదీలు జైళులో 50 సంవత్సరాలకు మించి బతికిన సందర్భాలు లేవని అధికారులు చెబుతున్నారు.
2008లో నికరాగ్వా నుంచి గ్వాటెమాలాకు బస్సులో వెళుతున్న వారిని డ్రగ్ ట్రాఫికర్లు అడ్డుకుని, వారిని సమీపంలోని మోంటియెల్కు చెందిన ఎస్టేట్‌కు తీసుకెళ్లి కాల్చి చంపారు.ఈ కేసులో మోంటియెల్, అతని భార్య సారా క్రూజ్ సహా ఎనిమిది మంది వ్యక్తులను దోషులుగా నిర్ధారించారు.వారికి కూడా జైలు శిక్షలు విధించారు.