అఫ్టానిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం (flishgt crash) చోటుచేసుకుంది. మొరాకో దేశానికి చెందిన ఛార్టర్డ్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అఫ్టానిస్థాన్లోని జెబాక్ జిల్లా తోప్‌ఖానా కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదం జరిగినట్లు అఫ్టానిస్థాన్ ధ్రువీకరించింది. ముందుగా ఇది భారత్ విమానమని భావించారు. తరవాత అది మొరాకో దేశానికి చెందినది ధ్రువీకరించారు.
ప్రమాదం జరిగి కూలిపోయిన విమానంలో ఎంత మంది ఉన్నారనే విషయం తేలాల్సి ఉంది. ఈ విమానాన్ని ఎయిర్ అంబులెన్సుగా ఉపయోగిస్తున్నారని అఫ్టానిస్థాన్ పోలీసులు తెలిపారు.అయితే తమ దేశానికి చెందిన ఫాల్కన్ విమానం, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తూ, గత రాత్రి నుంచి రాడార్‌తో సంకేతాలు తెగిపోయాయని రష్యా ప్రకటించింది. కొండ ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.