కట్టుకున్న భార్యను వదిలించుకునేందుకు ఓ దుర్మార్గుడు నీచానికి దిగాడు. భార్యను సముద్రంలో ముంచి హత్య చేశాడు. ఈ ఘటన గోవాలో వెలుగు చూసింది. భార్యను సముద్రంలో ముంచి చంపేసి, ప్రమాదవశాత్తూ చనిపోయిందంటూ డ్రామాలు వేసిన ఓ హోటల్ మేనేజర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం…
యూపీకి చెందిన గౌరవ్ కటియార్, దక్షిణ గోవాలోని ఓ హోటల్లో మేజేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది గంగ్వార్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది కాలానికే వీరి మధ్య తేడాలు వచ్చాయి. భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆమె తరచూ ఆరోపించేదని బంధువులు చెబుతున్నారు. ఇవన్నీ బయటపడకుండా ఉండాలనే భార్యను (goa crime news ) వదిలించుకోవడమే మేలని కటియార్ భావించాడు.
ముందస్తు ప్లాన్ ప్రకారం భార్యను గోవాలోని కాబో డి రామ బీచ్‌కు తీసుకెళ్లాడు. భార్యను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకుని సముద్రంలో పడేశాడు. సముద్రంలోకి వెళ్లేప్పుడు జంటగా వెళ్లి, తిరిగి ఒంటరిగా రావడాన్ని పర్యాటకులు గమనించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్ నాటకాలు మొదలెట్టాడు. భార్య ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయిందని చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు