ప్రముఖ నటి రష్మిక వీడియోను డీప్‌ఫేక్ రూపొందించిన కేసులో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, పాలపర్రు గ్రామానికి చెందిన ఈమని నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబరు 10న రష్మిక డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ (rashmika deepfake video case) చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నటి రష్మిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేసి, గుంటూరు జిల్లా యువకుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నవీన్ తండ్రి చిన్న తనంలోనే చనిపోయారు. తల్లి యానిమేటర్‌గా పనిచేస్తోంది. నవీన్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. తాను రష్మిక అభిమానినని, ఆమెతోపాటు మరో ఇద్దరి ప్రముఖుల పేర్లతోనూ సోషల్ మీడియాలో పేజీలు తెరిచినట్లు నవీన్ అంగీకరించాడు. రష్మిక పేజీకి పెద్దగా ఫాలోవర్స్ లేకపోవడంతోనే డీప్‌ఫేక్ వీడియో రూపొందించినట్లు అంగీకరించాడు. నవీన్ గత కొంతకాలంగా నగదు తీసుకుని కొందరి ఇన్‌స్టా పేజీలకు ఫాలోవర్స్‌ను పెంచే కార్యక్రమాలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు