డీప్‌ఫేక్ వీడియోలు సెలబ్రిటీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఏడాది నవంబరు 10న ప్రముఖ నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో (ramshmika deepfake video) ఒకటి వైరల్ అయింది. దీనిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, అనుమానితుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రష్మిక డీప్‌ఫేక్ వీడియో తయారు చేసిన దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ నగర డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. సోషల్ మీడియాలో పేరున్న తార జారా పటేల్ వీడియోకు, రష్మిక ముఖాన్ని తగిలించి పోస్ట్ చేశారు. అప్పట్లో అది బాగా వైరల్ అయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందింది. కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్ నుంచి కూడా పోలీసులకు నోటీసులు అందాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు