Eye Witnesses identify that Yasin Malik was the shooter who killed four IAF personnel in 1990
భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు
చెందిన నలుగురు ఉద్యోగులను 1990లో కాల్చి చంపింది ఉగ్రవాది యాసిన్ మాలిక్ అని నిర్ధారణ
అయింది. ఆనాటి ఘటనకు ప్రత్యక్షసాక్షులైన ఇద్దరు వ్యక్తులు యాసిన్ మాలిక్‌ను
గుర్తించారు. ఆ మేరకు వారు న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పారు.
నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్
లిబరేషన్ ఫ్రంట్ – జేకేఎల్ఎఫ్ నాయకుడు యాసిన్ మాలికే ఐఏఎఫ్ అధికారులను కాల్చి
చంపిన షూటర్ అని ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ప్రత్యేక టాడా కోర్టులో సాక్ష్యం
ఇచ్చారు.
‘‘భారత వైమానిక దళ అధికారుల హత్య కేసు
విచారణ స్పెషల్ టాడా కోర్టులో నిన్న జనవరి 18న జరిగింది. ఇద్దరు సాక్షులకు సీబీఐ
సమన్లు జారీ చేసింది. వారు కోర్టుకు హాజరయ్యారు. ఆనాటి సంఘటన ఎలా జరిగిందన్న
విషయాన్ని న్యాయస్థానానికి వారు వివరించారు. ఆ సాక్షులు యాసిన్ మాలిక్‌ను
గుర్తించారు. ఆనాడు ఐఏఎఫ్ ఉద్యోగులపై కాల్పులు జరిపింది అతనే అని వారు కోర్టుకు
వెల్లడించారు’’ అని సీబీఐ సీనియర్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ మోనికాకోహ్లీ తెలియజేసారు.
‘‘నాటి కాల్పుల్లో యాసిన్ మాలిక్‌కు
కూడా గాయాలయ్యాయి. అతనికి నాలుగు బులెట్లు తగిలాయని సాక్షులు వివరించారు’’ అని
మోనికా కోహ్లి చెప్సుకొచ్చారు. ఈ కేసు విచారణలో తదుపరి విచారణ ఫిబ్రవరి 15, 16
తేదీల్లో జరుగుతుందని ఆమె వివరించారు.
1990 జనవరి 25న జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదుల
దాడిలో స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా సహా నలుగురు వైమానిక దళ ఉద్యోగులు ప్రాణాలు
కోల్పోయారు. ఆ కేసుకు సంబంధించి సీబీఐ 1990 ఆగస్టు 31న జమ్మూలోని టాడా కోర్టులో
ఛార్జిషీట్ దాఖలు చేసింది.
యాసిన్
మాలిక్ రెండు కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి
విచారణ పూర్తి కావలసి ఉంది. స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా భార్య నిర్మల్ ఖన్నా ఈ
కేసులో న్యాయం కోసం పోరాడుతున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు