పాఠశాల విద్యార్థుల విహారయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు బోటులో షికారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. బోటు తిరగబడటంతో 14 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని వడదోరాలో ఈ హృదయ విదారక విషాద ఘటన చోటుచేసుకుంది.
నలుగురు ఉపాధ్యాయులు, 24 మంది విద్యార్థులు హరిణి సరస్సులో బోటు షికారు చేసేందుకు వెళ్ళారు. ఒక్క సారిగా పడవ తిరగబడటంతో ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 14 మంది విద్యార్థుల మృతదేహాలతో పాటు ఇద్దరు ఉపాధ్యాయల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. బోటు సిబ్బంది కొంతమంది విద్యార్థులను రక్షించారు.
పడవ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. లైఫ్ జాకెట్లు లేకుండానే పడవ ప్రయాణం చేయడం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది.
ప్రమాద మృతులకు రూ. 2 లక్షల నగదు సాయం అందించాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించింది. అలాగే గాయపడిన వారికి చికిత్స నిమిత్తం రూ. 50వేలు అందజేయనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ, బాధిత కుటుంబాలను పరామర్శించారు. గుజరాత్ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు రూ. 50 వేలు అందజేయనున్నారు.
సమగ్ర దర్యాప్తు జరిపి పది రోజుల్లోగా నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు