ఎల్డీఎఫ్,
యూడీఎఫ్ కూటములు అవినీతికి మారుపేరని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలకు
బీజేపీ కార్యకర్తలు వివరించాలని కోరారు. కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, శక్తి
కేంద్ర ఇన్చార్జీల సమ్మేళనంలో పాల్గొని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
దేశాన్ని అభివృద్ధి వైపు నడపడంలో బీజేపీకి మాత్రమే ఘనమైన రికార్డు ఉందన్నారు.
గడిచిన
9 ఏళ్ళ బీజేపీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు
పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. కాంగ్రెస్ మాత్రం 50 ఏళ్ళగా ‘గరిబీ
హటావో’ నినాదాన్ని పట్టుకుని వేలాడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ బలోపేతం కోసం కష్టపడుతున్న
కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
కేరళ
పర్యటనలో గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడిని పూజించారు. అక్కడ మలయాళ
నటుడు, బీజేపీ నేత సురేశ్ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని హాజరై వధూవరులను
ఆశీర్వదించారు. కొత్త జంటకు వరమాలలు అందించారు. వివాహ వేడుకకు హాజరైన మలయాళ నటులు
మోహన్ లాల్, ముమ్మట్టి తోనూ ప్రధాని ముచ్చటించారు.
కొచ్చి
పర్యటనలో భాగంగా రూ. 4 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ
ప్రారంభించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (CSL), న్యూ డ్రై డాక్(NDD), ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ(ISRF) ప్రారంభించారు.
అంతర్జాతీయ
వాణిజ్య కేంద్రంగా భారత్ మారుతున్న తరుణంలో దేశ సముద్ర శక్తిని కూడా పెంచుకుంటున్నట్లు
వివరించిన మోదీ, ఎల్పీజీ టెర్మినల్ దేశంలోనే అతిపెద్ధ డ్రై డాక్ గా నిలస్తుందని
ఆకాంక్షించారు.