Petition in Allahabad HC seeking ban of consecration ceremony
అయోధ్యలో నిర్మిస్తున్న రామచంద్రమూర్తి ఆలయంలో జనవరి
22న జరగబోతున్న ప్రాణప్రతిష్ఠ (Ayodhya Consecration) కార్యక్రమాన్ని నిషేధించాలంటూ అలహాబాద్ హైకోర్టులో
ప్రజాప్రయోజన వ్యాజ్యం (Public Interest Litigation) దాఖలైంది.
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన భోలాదాస్ (Bholadas) అనే వ్యక్తి ఆ పిటిషన్ దాఖలు చేసారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై
శంకరాచార్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను ప్రస్తావిస్తూ ఆ కార్యక్రమాన్ని నిషేధించాలని (Ban Consecration) భోలాదాస్ తన పిటిషన్లో డిమాండ్ చేసారు.
‘‘నిర్మాణం పూర్తికాని దేవాలయంలో బాలరాముడి
విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఆ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతులమీదుగా జరగబోతోంది. ఆ కార్యక్రమానికి
శంకరాచార్యులు అభ్యంతరం చెబుతున్నారు. పుష్యమాసంలో ఎలాంటి ధార్మిక కార్యక్రమాలూ
నిర్వహించరు. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అలాంటి అసంపూర్ణ మందిరంలో ఏ దేవత
ప్రాణప్రతిష్ఠా చేయకూడదు’’ అని కక్షిదారుడు తన పిటిషన్లో పేర్కొన్నారు.
భోలాదాస్ తన పిటిషన్లో ఈ
ప్రాణప్రతిష్ఠను సనాతన సంప్రదాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంగా
అభివర్ణించారు. త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమే
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని
ఆరోపించారు.