వివాహ వ్యవస్థలో విడాకులు సహజంగా మారాయి. తాజాగా భార్య తనకు తెలియకుండా ఐదో వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన నాలుగో భర్త ఆత్మహత్య (crime news) చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. ఇండోర్‌కు చెందిన సునీల్ లోహానీ నాలుగేళ్ల కిందట ఓ మహిళను వివాహం చేసుకున్నారు. అప్పటికే అది ఆమెకు నాలుగో వివాహం. ఆ తరవాత ఇద్దరి మధ్య వివాదాలు వచ్చాయి.కోర్టులో కూడా వరకట్న వేధింపుల కేసు నడుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.
గత కొంత కాలంగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. తాజాగా సునీల్ భార్య ఐదో వివాహం చేసుకుంది. విషయం తెలియడంతో నాలుగో భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు అతను చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు