Bio-toilets along Saryu Ghats for devotees in Ayodhya
యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Government) మకర
సంక్రాంతి సందర్భంలో సరయూనది ఒడ్డున ఉన్న ఘాట్లలో బయో టాయిలెట్లు (Bio
Toilets on Saryu Ghats) ఏర్పాటు చేసింది. అయోధ్యలో కొద్దిరోజుల్లో
రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఆ
సందర్భంగా వారికి తగిన ఏర్పాట్లు, నగరంలో పరిశుభ్రత ప్రయత్నాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్
ప్రభుత్వం ఈ బయో టాయిలెట్లు ఏర్పాటు చేసింది.
‘‘అయోధ్యలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు,
స్వచ్ఛత-పరిశుభ్రతను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో
నగరపాలక సంస్థ సరయూనది ఘాట్ల వెంబడి బయో టాయిలెట్లు ఏర్పాటు చేసింది. మకర సంక్రాంతి
వంటి పర్వదినాల్లో నగరానికి వచ్చే భక్తులకు ఈ విధమైన సౌకర్యాలు కలగజేస్తున్నాం’’
అని అయోధ్య మునిసిపల్ కమిషనర్, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ అయిన విశాల్
సింగ్ (Municipal Commissioner Vishal Singh) వివరించారు.
అయోధ్యలో పర్యావరణాన్ని పరిరక్షించడం, అయోధ్యను
ఆధ్యాత్మిక పర్యాటకానికి తలమానికమైన నగరంగా తీర్చిదిద్దడం యోగి ఆదిత్యనాథ్ దార్శనికత
అని విశాల్ సింగ్ వెల్లడించారు. నగరమంతా బహుళభాషల్లో సైన్‌బోర్డులు, స్త్రీపురుషులకు
వేర్వేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసారు. పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా,
ఘనవ్యర్థాల నిర్వహణ నియమావళి 2016కు లోబడి, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇంకా స్వచ్ఛభారత్
మిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా బయోటాయిలెట్లు నిర్మించారు.
‘‘అయోధ్య సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలను
సవాల్‌గా తీసుకుని పనిచేసాం. ప్రణాళికాబద్ధంగా, ఏమాత్రం అలసత్వం లేకుండా పనిచేయడం
వల్లే అతితక్కువ సమయంలో ఇది సాధ్యమైంది. నిరంతరాయంగా అంకితభావంతో కృషి చేసినందునే
ఏడాదిన్నరలో అయోధ్యను ఇంత అందంగా తీర్చిదిద్దగలిగాం’’ అని నగర డివిజనల్ కమిషనర్
గౌరవ్ దయాళ్ చెప్పారు. (Divisional Commissioner Gaurav Dayal)
జనవరి 22న రామ్‌లల్లాను స్వాగతించడానికి అయోధ్యా
నగరం సర్వసన్నద్ధంగా ఉందని గౌరవ్ దయాళ్ వెల్లడించారు.