యూపీ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలోని ఈద్గాలో సర్వేకు అనుమతిస్తూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(supreme court verdict on madhura srikirshna temple) నిలిపివేసింది. శ్రీ కృష్ణ ఆలయానికి సమీపంలోని ఈద్గాలో శాస్త్రీయ సర్వేకు గతంలో అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. దీనిపై ముస్లిం సంఘాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కేసు విచారించిన సుప్రీంకోర్టు, ఇవాళ కీలక తీర్పు వెలువరించింది.
మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో ఈద్గా నిర్మించారని, దీనిపై శాస్త్రీయ సర్వేకు అనుమతించాలంటూ స్థానిక కోర్టులో 9 పిటిషన్లు వేశారు. ఇవి చాలా కాలం అలాగే ఉండిపోయాయి. తరవాత కేసులను మథుర కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. గత ఏడాది డిసెంబరులో న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించింది.
హైకోర్టు తీర్పును కొన్ని ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ వివాదంపై హైకోర్టులో విచారణ కొనసాగుతుందని తీర్పులో స్పష్టం చేశారు.