Madhya Pradesh to observe Dry-day on 22 January
యావద్దేశం రామనామ జపంతో మునిగిపోయింది. తన జన్మభూమిలో
నూతన మందిరంలో రామయ్య కొలువుతీరే క్షణాల (Ayodhya Ram Temple Consecration
Ceremony) కోసం యావత్ భారతీయులూ ఉద్వేగంతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు మధ్యప్రదేశ్‌లో
(Madhya Pradesh) మద్యం విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది. (Dry
Day)
జనవరి 22న శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠా
కార్యక్రమం సందర్భంగా ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మరాదని మధ్యప్రదేశ్
రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 22 పవిత్ర కార్యక్రమం సందర్భాన్ని పురస్కరించుకుని
పొరుగు రాష్ట్రం మధ్యప్రదేశ్ ఆ రోజు ‘డ్రై-డే’ పాటిస్తున్నట్లు ప్రకటించింది.
ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ
రాష్ట్రముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయం వెల్లడించారు. ‘‘జనవరి 22న రాష్ట్రం అంతటా
డ్రై-డే పాటించాలని నిర్ణయం తీసుకున్నాం. మద్యం లేదా మత్తు కలిగించే ఏ పదార్ధాన్ని
అయినా విక్రయించే దుకాణాలన్నీ ఆరోజు మూసివేసి ఉంటాయి’’ అని చెప్పారు.
అయోధ్యానగరం ఉన్న ఉత్తరప్రదేశ్‌తో
పాటు ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, అసోం రాష్ట్రాలు ఇప్పటికే జనవరి 22న డ్రై-డే ప్రకటించాయి.