డీప్‌ఫేక్ వీడియోలు సెలబ్రిటీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా బాధితుల ఖాతాలో సచిన్ చేరారు. ఓ గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రచారం చేస్తున్నట్లు ఆ వీడియో తయారు చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉంది తాను కాదంటూ చివరకు సచిన్ టెండూల్కర్ (sachin tendulkar deepfake video) వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సచిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
డీప్‌ఫేక్ వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి వీడియోలు, యాప్‌లు, ప్రకటనలు గుర్తించిన వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ, అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సచిన్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాజా పోస్ట్‌కు కేంద్ర ఐటీశాఖ మంత్రి, మహారాష్ట్ర సైబర్ విభాగాలకు ట్యాగ్ చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు