ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై తరచూ దాడుల గురించి మనం వింటూనే ఉన్నాం. తాజాగా ఓ విమాన ప్రయాణీకుడు ఏకంగా ఫైలెట్పై దాడికి దిగాడు. విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని ఫైలెట్ ప్రకటించడంతో ఓ ప్రయాణీకుడు ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ప్రకటన చేసిన ఫైలెట్పై దాడికి (indigo flight) దిగాడు. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానాశ్రయ అధికారులు వర్గాల సమాచారం మేరకు…
ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా ల్యాండింగ్ సాధ్యంకాదని, ప్రయాణం వాయిదా వేశారు. ఇదే విషయాన్ని పైలెట్ అనౌన్స్ చేశాడు.
ఇది విన్న ప్రయాణీకుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. విమానంలో చివరి సీట్లో కూర్చున్న ప్రయాణీకుడు, వేగంగా ఫైలెట్ వద్దకు చేరుకుని దాడికి దిగాడు. ఈ ఘటనపై ఇండిగో ఫిర్యాదు చేసింది. దాడికి దిగిన వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. విమానం 13 గంటలు ఆలస్యమైంది. పొగమంచు కారణంగా ఆలస్యమైంది. దానికి ఫైలెట్ ఏం చేస్తారంటూ నెటిజన్లు కామెంట్లు మొదలు పెట్టారు. ఇలాంటి వారిని నో ఫ్లై లిస్టులో చేర్చాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు